TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట పట్టణంలోని హోటల్ 9 ఫంక్షన్ హాల్లో నిర్వహించిన డాక్టర్ భువనేశ్వరి పంచాల్ దంపతుల కుమారులు సుమేద్ పంచాల్, సుమన్ పంచాల్ల దోతి సెర్మనీ మరియు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషాన్ని పంచుకుని కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ బిట్ల నిఖిత ప్రేమ్, రియాజ్, అనిల్ రాగం, గుణాకర్, అఖిల్, సోమ శంకర్ తదితరులు పాల్గొని చిన్నారులకు ఆశీస్సులు అందజేశారు.
Post Views: 76









