శంభునిపేట: 37వ డివిజన్ పరిధిలోని mm నగర్ కాలనీవాసులు స్థానిక 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ దంపతులకు గత 5సంవత్సరాలు కాలనీ అభివృద్ధికీ సహకరించి రోడ్లు, డ్రైన్స్, నల్లాలు, ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు మొదలగు అభివృద్ధి చేసిన కార్పొరేటర్ దంపతులకు కాలనీ వాసులు ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కాలనీ గౌరవ అధ్యక్షులు ఎండి వుల్ఫత్, కాలనీ అధ్యక్షుడు సింగారపు ఏలియా మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు మా కాలనీ అభివృద్ధికి కార్పొరేటర్ దంపతులు ఎంతగానో సహకరించారని ముఖ్యంగా గుడిసెల కాలనీ ఆయన మినిమం మౌలిక వసతులు కాలనీలో లేకపోవడం వలన కార్పొరేటర్ అయినప్పటినుండి భోగి సువర్ణ దంపతులు కాలి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి కాలనీకి కావాల్సిన రోడ్లు, డ్రైనేజీలు మంచినీరు ఇందిరమ్మ ఇండ్లు బోర్లు తదితర అభివృద్ధి తో పాటు ఇండ్ల పట్టాల సహకారం కూడా చేశారని ఎప్పటికీ కాలనీవాసులు కాలనీ మర్చిపోదని భవిష్యత్తులో ఇలాంటి చదువుకున్న కార్పొరేటర్ మళ్లీ మాకు కార్పొరేటర్ గా రావాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నామని అన్నారు.
అనంతరం కార్పొరేటర్ దంపతులు మాట్లాడుతూ మాకు ఐదు సంవత్సరాల పాటు సేవ చేసుకునే అవకాశం కల్పించినటువంటి హోటల్ మహాశయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఎంఎం నగర్ వాసులు మా వెన్నంటే ఉంటూ మమ్మల్ని నడిపించాలని కాలనీ అభివృద్ధికి మా పూర్తి సహకార సహకారాలు అందించాలని భవిష్యత్తులో తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం మాపై ఉండాలని తిరిగి ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించాలని కోరుకున్నారు.
కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు రవి సమ్మయ్య సాంబయ్య జగన్ ప్రభాకర్ రాణి సరిత సంధ్య రాజు కుమారస్వామి సాంబయ్య దేవేంద్ర లతోపాటు కాలనీ వాసులందరూ పాల్గొని కార్పొరేటర్ దంపతులకు సన్మాన కార్యక్రమం చేసారు. శాలువాతో సన్మానం చేసి ఓకే ఇచ్చి మెమొంటో అందించి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు









