TG 5, సంగారెడ్డి ప్రతినిధి
కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన మాల అబ్రహాం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో చికిత్స పొందుతున్నారు. చికిత్స ఖర్చుల కారణంగా కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎమ్మెల్యే LOC మంజూరుకు కృషి చేసి, సంబంధిత చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మాల అబ్రహాం కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 195









