పాల్గొన్న వరంగల్ 37 38 ఈ విధంగా తాజా మాజీ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్& భైరబోయిన ఉమా దామోదర్ యాదవ్
ఖిలా వరంగల్ : శుక్రవారం పడమరకోట ఐదవ బ్లాక్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్ జనరల్ ఫండ్ రూ.10లక్షల నిధులతో మున్నూరు కాపు పరపతి సంఘం మరియు మున్నూరు కాపు ఉద్యోగుల పరపతి సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన తాజా మాజీ కార్పొరేటర్లు భోగి సువర్ణ సురేష్, బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్ మరియు మున్నూరు కాపు పరపతి సంఘ కార్యవర్గ కమిటీ, మరియు మున్నూరు కాపు ఉద్యోగ పరపతి సంఘం బాధ్యులు.
ఈ సందర్భంగా తాజా మాజీ కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ యాదవ్ మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి నడుపుతున్న మున్నూరు కాపు పర్పస్ సంఘం మరియు మున్నూరు కాపు ఉద్యోగులపర సంఘం కు సొంత భవనం లేకపోవడం వలన సభ్యులందరూ ఉమ్మడిగా స్థలం కొనుగోలు చేయడం వలన ఇటీవల జరిగిన వార్షికోత్సవంలో కమిటీ సభ్యులు కార్పొరేటర్ల దృష్టికి కమ్యూనిటీ హాల్ కట్టాలని తీసుకురావడంతో జనరల్ ఫండ్ మున్సిపాలిటీ నుండి పది లక్షల రూపాయలు మంజూరు చేయించి పనులు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్లు అడిగిన వెంటనే గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ మురళీధర్ రావు గారు ఈ నిధులు మంజూరుకు సహకరించినందుకు మున్నూరు కాపు సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు భవిష్యత్తులో ఇవే కాకుండా అవసరానికి అనుగుణంగా మరిన్ని నిధులు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు పరపతి సంఘం మరియు ఉద్యోగ సంఘం నాయకులు సిద్ధం శెట్టి అనిల్, గజ్జల శ్యామ్, శ్రీనివాస్, పూర్ణచందర్, మాందాటి నరేష్ చిన్ని, సులగం గోపాలు, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు లతోపాటు తదితరులు పాల్గొన్నారు









