- గ్రామ అభివృద్ధి తన ధ్యేయం అంటున్న సర్పంచ్ నవీన్
- గ్రామ వార్డులో కొత్త బోర్ స్టార్టర్ ఏర్పాటు
TG 5, సంగారెడ్డి ప్రతినిధి
ముబారక్పూర్ గ్రామ ప్రజల సాగు మరియు త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, శుక్రవారం రోజున వార్డులో ఉన్న పాత బోర్ మోటార్ స్టార్టర్‌ను తొలగించి, దాని స్థానంలో నూతన ఆధునిక స్టార్టర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. గత కొంతకాలంగా పాత స్టార్టర్ మాటిమాటికీ పాడవుతుండటంతో నీటి సరఫరాకు ఆటంకం కలుగుతోందని గుర్తించిన స్థానిక ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి ఈ ఏర్పాటు చేశారు.
సందర్భంగా సర్పంచ్ నవీన్ ప్రజల కనీస అవసరాలైన నీరు, విద్యుత్ వంటి సమస్యలను పరిష్కరించడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. వార్డ్ మెంబర్ జ్యోతి రామచందర్ పర్యవేక్షణలో ఈ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి.
స్టార్టర్ మార్పుతో ఇకపై నీటి సరఫరాలో అంతరాయం కలగదని వారు ధీమా వ్యక్తం చేశారు. సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరించినందుకు వార్డు ప్రజలు సర్పంచ్ నవీన్ కి మరియు వార్డ్ మెంబర్ జ్యోతి రామచందర్ కి కృతజ్ఞతలు తెలిపారు.









