అర్ధరాత్రి ఒంటరిగా నగరంలోకి వెళ్లిన మల్కాజ్‌గిరి సీపీ సుమతి.. మహిళల భద్రత పై ఆవేదన

హైదరాబాద్ :- గత అర్ధరాత్రి మల్కాజ్‌గిరి సీపీ సుమతి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్, మెట్రో స్టేషన్, ప్రధాన కూడళ్లలో తిరుగుతూ అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు, గంజాయి మత్తులో ఉన్న మరికొందరు ఆమె చుట్టూ గుమికూడి అసభ్యకరంగా ప్రవర్తించడంతో సీపీ సుమతి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.ఒక మహిళ అర్ధరాత్రి నగరంలో ఒంటరిగా బయటకు వస్తే ఇలాంటి భయానక పరిస్థితులను ఎదుర్కోవాలా?” అనే ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.ఈ ఘటన నేపథ్యంలో సుమారు 40 మంది ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.ఒక పోలీస్ అధికారిణికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి” అనే భావనతో అదే ప్రాంతంలో ఈరోజు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన మహిళల భద్రత సమావేశంలో మల్కాజ్‌గిరి సీపీ సుమతి, ఎల్‌బీనగర్ డీసీపీ డా. అనురాధ తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హోటల్స్, రెస్టారెంట్స్, ఓయో హోటల్స్, హాస్టల్స్, పేయింగ్ రూమ్స్, స్టడీ రూమ్స్ నిర్వాహకులు, స్థానిక కాలనీవాసులు, విద్యార్థులతో సమావేశమై పలు సూచనలు చేశారు.నార్కోటిక్ టీమ్, ఈగిల్ టీమ్ సభ్యులతో కలిసి సే నో టు డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులకు డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలు, యువత భవిష్యత్తుపై పడే ప్రభావాలపై వివరించారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తూ కరపత్రాలు, ప్రత్యేక బుక్లెట్లు పంపిణీ చేశారు.మహిళల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు సమాజం మొత్తం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు