TG 5, సంగారెడ్డి ప్రతినిధి
అంతర్జాతీయ నర్స్ డే వారోత్సవాలలో తన జ్ఞాపకాలను వెల్లడించిన టీజిఐఐసి సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఆధ్వర్యం లో సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియం లో ఇంటర్ నేషనల్ నర్సింగ్ డే వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి నిర్మలా జగ్గారెడ్డి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను రాజకీయాలలోకి రాకముందు నర్స్ గా పనిచేసిన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఒక మారుమూల గ్రామం నుండి వచ్చిన తాను నర్సింగ్ వృత్తి మీద ఎంతో ఇష్టం తో బీఎస్సీ నర్సింగ్ చదువుకున్నానని తెలిపారు. నర్స్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ వృత్తి జీవితం లో భాగంగా 8 సంవత్సరాలు కుష్టు రోగుల వార్డులో పని చేసి వారికి సేవలు అందించానని తెలిపారు. తన భర్త జగ్గారెడ్డి ప్రోత్సాహం తో ఉద్యోగం మానేసి రాజకీయాలలోకి వచ్చానని నర్సింగ్ విద్యార్థులకు తన అనుభవాలను వివరించారు.









