ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, మజ్జిగ పంపిణీ

నల్గొండ:రిపోర్టర్ – నవీన్ కుమార్.Ch – TG5 NEWS

వాసవి క్లబ్ కేసిజిఎఫ్ నల్గొండ ప్రెసిడెంట్ మిట్టపల్లి వాత్సవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు పండ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో యాచకులు, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే చెరువుగట్టులోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా వాసవి క్లబ్ గవర్నర్ సతీష్, ఐఈసీ సభ్యుడు కోటగిరి రామకృష్ణ మాట్లాడుతూ వాసవి క్లబ్ సభ్యులు వివాహ వార్షికోత్సవాలు, జన్మదినాల సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. “మానవ సేవే మాధవ సేవ” అనే భావనతో సమాజ సేవలో ముందుంటున్నారని పేర్కొన్నారు.

తదనంతరం మిట్టపల్లి వాత్సవ్ జన్మదిన వేడుకలను నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్ష, డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ మల్లిక, నేస్తం సొసైటీ అధ్యక్షుడు వెంకన్న, శీను, రవి, యాదయ్య, క్యాబినెట్ సెక్రటరీ నూనె కిషోర్ కుమార్, వైస్ గవర్నర్ తాళ్లపల్లి రాము, వాసవి క్లబ్ కేసి జిఎఫ్ కార్యదర్శి మురారిశెట్టి శంకర్, కోశాధికారి తాడిశెట్టి సంతోష్, వాసవి క్లబ్ స్ఫూర్తి ప్రెసిడెంట్ సంతోషిని, కార్యదర్శి మురారిశెట్టి నందిని, కోశాధికారి తాడిశెట్టి విజయ, కోటగిరి దైవదినం, గోవింద్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు