పోక్సో, అత్యాచార కేసులలో మహిళలు, బాలికల భద్రతకు “భరోసా” పెద్దపీట.

• భరోసా సెంటర్, సిబ్బంది సేవలు అభినందనీయం: జిల్లా ఎస్పీ

• భరోసా 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా భరోసా కేంద్రంలో నిర్వహించిన వేడుకలకు హాజరైన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్., అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్.

రిపోర్టర్: ఉల్లిగడ్డల శివకుమార్

సంగారెడ్డి ప్రతినిధి

తేది: 07.05.2026 భరోసా 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా భరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్., అదనపు ఎస్పీ శ్రీ చైతన్య రెడ్డి, ఐపీఎస్. హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాల నేపథ్యంలో వర్మ కమిటీ సిఫార్సుల ఆధారంగా, నిర్భయ ఘటన అనంతరం పోక్సో, అత్యాచార కేసులలో బాధిత మహిళలకు అన్ని రకాల సేవలను ఒకే వేదికపై అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 2016 మే 7వ తేదీన ఆనాటి ఉమెన్ సేఫ్టీ వింగ్ డైరెక్టర్ స్వాతి లక్రా, ఐపీఎస్. ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భరోసా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

గత 10 సంవత్సరాలుగా పోక్సో, అత్యాచార కేసులలో బాధిత మహిళలు, బాలికల భద్రతకు పెద్దపీట వేస్తూ, ఫిర్యాదు నమోదు నుండి న్యాయస్థానంలో తుది తీర్పు వెలువడే వరకు మెడికో-లీగల్ సేవలు సహా అన్ని రకాల సేవలను ఒకే గొడుగు కింద అందిస్తూ, బాధిత మహిళల, ప్రజల మన్ననలు పొందుతూ తెలంగాణ భరోసా సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎస్పీ పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు