TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట మండలం వేంటాపురం గ్రామంలో శ్రీ పద్మావతి గోదా సమేత అద్భుత వేంకటేశ్వర స్వామివారి చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ గారు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులతో కలిసి బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 5









