మే 10వ తేదీన హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో బిజెపి రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు నేడు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 42 వ డివిజన్ రంగశాయిపేట ప్రాంతంలో బిజెపి నాయకులు బక్కీ రంజిత్ అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోదీ సభ దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే సభగా నిలవబోతోందని తెలిపారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 24 డివిజన్‌ల నుంచి ప్రతి డివిజన్‌కు కనీసం 1000 మంది కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చి ఈ సభను ఘన విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని మోదీ నాయకత్వానికి తమ మద్దతును చాటాలని, ఈ సభను చారిత్రాత్మకంగా నిలపాలని ఎర్రబెల్లి ప్రదీప్ రావు కోరారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమ డివిజన్ ఇంచార్జ్ కూచన క్రాంతి, మండల అధ్యక్షులు తాళ్లపల్లి అర్జున్, సీనియర్ నాయకులు శ్రీరామోజు మోహన చారి, పరమేష్, కార్తీక్,నాగరాజు,స్థానిక బిజెపి నాయకులు, బూత్ అధ్యక్షులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.









