నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలోని బుడ్డారెడ్డి గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో బుధవారం వేదాగమ పండితులు అన్నేపర్తి శివాజీ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణలు,బాజా భజంత్రీల మధ్య శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట,నవగ్రహ ప్రతిష్ట మరియు శిలా ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ మహోత్సవానికి నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరై స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వారిని దేవాలయ కమిటీ తరఫున శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సింగం బాలకృష్ణ,మాజీ సర్పంచ్ బొమ్ము శ్రీనివాస్,ఉప సర్పంచ్ వంశీ,వార్డు సభ్యులు,దేవాలయ కమిటీ సభ్యులు,మండల నాయకులు,స్థానిక నాయకులు,గ్రామ పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు.
Post Views: 195









