రిపోర్టర్: ఉల్లిగడ్డల శివకుమార్
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మే 06:-
సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా టి.ఎల్. సంగీత బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం రెవెన్యూ శాఖ అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులతో ఆమె సన్నిహితంగా పరిచయం చేసుకున్నారు.
అడిషనల్ కలెక్టర్గా జిల్లా అభివృద్ధి, రెవెన్యూ పరిపాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని టి.ఎల్. సంగీత తెలిపారు.
Post Views: 46









