జెసిబి స్వాధీనం – టిప్పర్లు, ట్రాక్టర్లు పరార్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం…….
షాబాద్ మండలం నాగర్‌గూడ ఈసీ వాగులో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు దాడి చేసి ఒక జెసిబిని స్వాధీనం చేసుకున్నారు. వాగులో ఇసుకను జెసిబి, టిప్పర్లు, ట్రాక్టర్ల సహాయంతో అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పోలీసులు చేరుకునేలోపే కొన్ని ట్రాక్టర్లు, ఒక టిప్పర్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. అయితే ఒక జెసిబిని పోలీసులు స్వాధీనం చేసుకుని షాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఇసుక అక్రమ రవాణాకు ముఖ్య సూత్రధారులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ప్రభుత్వ అనుమతులు లేకుండా జరుగుతున్న ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఈ సందర్భంగా స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వాగులో ఇసుక తవ్వకాల వల్ల పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో ఈ గుంతల్లో పశువులు, కొన్నిసార్లు రైతులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు.
ఇసుక మాఫియా పై రైతులంతా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు రైతులు తెలిపారు.









