వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, ఎంపీ కడియం కావ్యతో పాటు కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు.
నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. నగరానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇదే సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో మహిళల కోసం ప్రత్యేక స్టాల్స్ నిర్మాణానికి మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య భూమి పూజ నిర్వహించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ స్టాల్స్ ఉపయోగపడతాయని తెలిపారు.
Post Views: 9









