భూ భారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం భూ భారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా మండలాల వారీగా పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియపై క్షుణ్ణంగా సమీక్షించి, పలు సూచనలు చేశారు.

ఈ నేపథ్యంలో *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. భూ భారతిలో గల వివిధ మాడ్యూల్స్ లోని సక్సెషన్, మ్యుటేషన్, ఖాతా సమీకరణ, డేటా కరెక్షన్, అర్బన్ ల్యాండ్, కోర్టు కేసులు, జీపీపీ, పీపీబీ, నాలా తదితరాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

అలాగే పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని,ఎప్పటికప్పుడు వస్తున్న దరఖాస్తు లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

అదే విధంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా (Simple Sale Deeds) సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు *కలెక్టర్* సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.

సాదాబైనామా కేసులను ప్రత్యేక దృష్టితో పరిశీలించి, ప్రతి దరఖాస్తును సమగ్రంగా ధృవీకరించాలన్నారు.

భూ సంబంధిత పత్రాలు, పాత రికార్డులు, ఆదాయ పత్రాలు, తదితర వివరాలను ఖచ్చితంగా పరిశీలించాలన్నారు.

దరఖాస్తుదారులకు పారదర్శకంగా సమాచారం అందించి, ఎటువంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఫీల్డ్ స్థాయిలో తహసీల్దార్లు స్వయంగా పర్యవేక్షణలు నిర్వహించి, నివేదికలు సమర్పించాలన్నారు.

రెవెన్యూ డివిజనల్ అధికారులు సమస్యాత్మక కేసులను జిల్లా స్థాయికి పంపించి, తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు

ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, అన్ని మండలాల తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు