వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్: అనంతరం రైతు సభకు పయనం

వరంగల్ జిల్లా ఓరగల్లు ఇలవేల్పు దైవంగా ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారి ఆలయానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేరుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

అమ్మవారిని భక్తితో దర్శించుకున్న కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లో కొంతసేపు గడిపిన ఆయన భక్తులతో మాట్లాడారు.

ఇక, అమ్మవారి దర్శనం అనంతరం హంటర్ రోడ్‌లో నిర్వహించనున్న రైతు సభకు కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ సభలో రైతు సమస్యలపై ముఖ్యంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు