ఘాట్కేసర్ సర్కిల్ పరిధి యమ్నంపేట డివిజన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ..

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ జోన్ ఘాట్కేసర్ సర్కిల్ పరిధి యమ్నంపేట డివిజన్లో పలు కాలనీల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేశారు మున్సిపల్ అధికారులు, గ్రౌండ్ + 2 అనుమతులు తీసుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెట్ బ్యాక్స్ మరియు పార్కింగ్ స్థలాలు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు (5 నుండి 6) అంతస్తుల భవనాలు నిర్మాణం చేస్తున్న కొందరు బడా బాబుల అక్రమ నిర్మాణాల పైన మున్సిపల్ అధికారులు ఉక్కు పాదం మోపారు, అక్రమ నిర్మాణాలను సహించేది లేదని, ప్రభుత్వ నిబంధనల మేరకే నిర్మాణాలు చేపట్టాలని లేని పక్షంలో అక్రమ నిర్మాణాలు కూల్చేసి అక్రమ నిర్మాణధారుల పైన చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు అన్నారు, ఈ కూల్చివేతల కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు