స్వయంభు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులి మామిడి రాజు

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

కలియుగ ప్రతక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి, దైవ చింతననే భక్తులకు పరమానందం అన్న పులిమామిడి రాజు

సదాశివపేట పట్టణ సమీపంలోని వెంకటాపూర్ గ్రామంలో స్వయంబుగా వెలసిన శ్రీ పద్మావతి సమేత అద్భుత వెంకటేశ్వర స్వామి చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజును ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇట్టి కార్యక్రమాలు తేది: 05-05-2026 మంగళవారము నుండి మొదలుకొని 08-05-2016 శుక్రవారము వరకు నిర్వహించబడునని, అదేవిధంగా గురువారం రోజున ఉదయం 11:00 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. సాయంత్రం 4:00 గంటల నుండి స్వామి వారి దివ్య విమాన రథోత్సవం సదాశివపేట పట్టణం నుండి వెంకటాపూర్ ఆలయం వరకు నిర్వహించబడుతుందని ఇట్టి కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అధ్యక్షులు చిల్వేరి వెంకటేశం అన్నారు.

ఆహ్వానం స్వీకరించిన పులిమామిడి రాజు మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పండల జగదీశ్వర్ పంతులు, షోలాపురం రాజు, తాటి కొండ నాగనాథ్, సుధాకర్, మల్ రెడ్డి, భాస్కర్, లక్ష్మణ్, పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు