హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. మంత్రి దామోదర రాజనర్సింహ 

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

  • ఫార్మా, ఐటీ హబ్ గా హైదరాబాద్ కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు .
  • హైదరాబాద్ లో మెడికల్ టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి.
  • ఫిల్మ్ ఫెస్టివల్స్ కి హైదరాబాద్ వేదిక కావడానికి ప్రభుత్వం ప్రోత్సాహం.

హైదరాబాద్ లో దేశంలోనే అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహణపై రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి దామోదర్ రాజనర్శింహ

హైదరాబాద్ నగరంలో చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ వరల్డ్స్ 1st ఫార్మాట్ & ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ నిర్వహణ పై రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్శింహ సంగారెడ్డి లోని తన నివాసంలో ఆవిష్కరించారు.

హైదరాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఫార్మా, ఐటీ హబ్ గా హైదరాబాద్ కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు కు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో మెడికల్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరానికి మిడిల్ ఈస్ట్, యూరోపియన్ దేశాలు, ఆఫ్రికా లాంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున వైద్య సేవల కోసం వస్తున్నారన్నారు. ఫిల్మ్ ఫెస్టివల్స్ కి హైదరాబాద్ వేదిక కావడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నామన్నారు.

దేశం లోని సినిమా, OTT, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాలలో ప్రభావితం చేసే ముఖ్యమైన వ్యక్తులందరూ హైదరాబాద్ లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 43 దేశాల నుండి ప్రతినిధులు హాజరు అవుతున్నారని, దేశంలో 8 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు , ఫిల్మ్ మేకర్స్ పాల్గొంటారని నిర్వాహకులు మంత్రికి వివరించారు. దేశం లో సినిమా, Ott, ఇంస్టాగ్రామ్ , యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరు ఒక్క వేదిక పైకి రావడం ఇదే మొదటిసారని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు