బుడ్డారెడ్డి గూడెంలో ఘనంగా అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు: క్రీడాకారులకు దుస్తుల పంపిణీ

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల పరిధిలోని బుడ్డారెడ్డి గూడెం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థాన విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలను గ్రామస్తులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.ఈ పవిత్ర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలు క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ సింగం బాలకృష్ణ గారు కబడ్డీ క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల యువతలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందని, భక్తితో పాటు క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు మరియు క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. దేవాలయ ప్రతిష్ఠాపనతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు