TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాలిపటేల్ ప్రభు ఆధ్వర్యంలో భవాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో 14 మంది తో చార్ ధాం యాత్ర ఏప్రిల్ 26వ తేదీ నా ప్రారంభించి మే మూడో తేదీ సాయంత్రం మంచుకొండలో వెలిసినటువంటి ఆ దేవదేవుడైన కేదార్నాథ్ కేదారేశ్వరుని దర్శించుకోవడం జరిగింది. చార్ ధాం యాత్రకు చాలామంది చాలా ఆపోహాలు కలిగిస్తున్నారు. ఇక్కడ అలాంటిదేమీ లేదు చాలా ప్రశాంతంగా ఆ దేవదేవుని దర్శించుకోవచ్చు చార్ధామ్ యాత్ర అంటే ఓపికతో కూడుకున్నటువంటి ప్రయాణం ఉత్తరాఖండ్ ప్రభుత్వం చక్కటి ఏర్పాట్లు యాత్రికుల కోసం చేసింది. మన ప్రాంతంలోని ఆ పరమశివుని భక్తులంతా కూడా సంతోషంగా వెళ్లి చార్ ధాం యాత్ర లో యమునోత్రి గంగోత్రి ,కేదారేశ్వర,బద్రీనాథ్ యాత్ర చేసుకొని దర్శించుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలియజేయడం జరిగింది









