హన్మకొండలో పశువుల స్మగ్లర్ల అల్లర్లు కలకలం రేపాయి. జాతీయ రహదారిపై సినిమా సన్నివేశాన్ని తలపించేలా భారీ ఛేజింగ్ జరిగింది. సమాచారం ఇచ్చిన యువకుడి కారును ఇన్నోవాతో ఢీకొట్టి, ఇనుప రాడ్లతో దాడి చేసిన కసాయి ముఠా అతని బ్రెజ్జా కారును సైతం పట్టపగలు దోచుకెళ్లింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో గంటల వ్యవధిలోనే నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న కంటైనర్ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనలో నరకయాతన అనుభవిస్తున్న 89 గోవులను పోలీసులు రక్షించి ధర్మసాగర్ గోశాలకు తరలించారు. సుమారు రూ.20 లక్షల విలువైన పశువులతో పాటు మూడు భారీ వాహనాలను సీజ్ చేశారు.
కేయూసీ పోలీసుల చాకచక్యంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Post Views: 180









