మీర్ పేట్:
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా మీర్ పేట్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యం లో జిల్లెల్లగూడ చౌరస్తా లో ఘనంగా నిర్వహించారు.పార్టీ నాయకుల తో కలిసి కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు.మహేశ్వరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే శక్తి సామర్థులు ఆ భగవంతుడు సబితా ఇంద్రారెడ్డికి ప్రసాదించాలని దేవుడిని కోరుకుంటున్నాటు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఉప ముఖ్యమంత్రి గా సబితా ఇంద్రారెడ్డి కి పదవి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.నియోజకవర్గంలో ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉంటూ,అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజానేతగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎదిగారని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయామంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనపడుతుందని ఈ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటిపడిందని అన్నారు.
సబిత ఇంద్రారెడ్డి పై కోపంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు,పార్టీ నాయకులు,కార్యకర్తలకు సబితా ఇంద్రారెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.









