దేశవ్యాప్తంగా బీజేపీ విజయఝరులు – GWMCలో కూడా కాషాయ పతాకం ఎగురవేయడం ఖాయం*-ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు.

పత్రికా ప్రకటన:

ఈరోజు పలు రాష్ట్రాల్లో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం మరియు పుదుచ్చేరి రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఘన విజయాలు సాధించి అధికారాన్ని చేజిక్కించుకోవడం పట్ల దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ విజయాలు దేశ ప్రజలు బీజేపీ పట్ల ఉంచిన విశ్వాసానికి, ప్రధాని నాయకత్వంలో సాగుతున్న అభివృద్ధి పాలనకు నిదర్శనమని నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు మరియు బిజెపి రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు ఓ సిటీలోని ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారి నివాసంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశంలోని పలు రాష్ట్రాల్లో సాధించిన విజయాలు బీజేపీపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచాయని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.

అలాగే రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి కాషాయ జెండాను ఎగురవేయడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ నగర అభివృద్ధి కోసం బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు “బీజేపీ జిందాబాద్” నినాదాలతో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. దేశవ్యాప్తంగా సాధించిన విజయాల స్పూర్తితో రాబోయే ఎన్నికలలో కూడా పార్టీ విజయపథంలో ముందుకు సాగుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు