TG 5, సంగారెడ్డి ప్రతిని ధి
సదాశివపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజును తన అనుచర గళంతో కలిసి తెర్పోల్ సర్పంచ్ సతీష్ ముదిరాజ్ ఘనంగా సన్మానించారు. సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో పులిమామిడి రాజు చేస్తున్న సేవలను అభినందిస్తూ శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సతీష్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూ అందరికి అందుబాటులో ఉండే ప్రజానాయకుడిగా పులిమామిడి రాజు గుర్తింపు పొందారని అన్నారు. గ్రామాల అభివృద్ధి మరియు పట్టణాల ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు.
పులిమామిడి రాజు మాట్లాడుతూ తనపై చూపిన గౌరవానికి సర్పంచ్ సతీష్ ముదిరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో మరింత సేవ చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ ప్రభు సార్, మోహన్, ఉప సర్పంచ్ మల్లేశం , పాండు, రాజు, కిష్టయ్య, అంజయ్య, ఆంజనేయులు, మంజూరు, మహబూ, శ్రీను, కార్తీక్ మరియు పి.ఎం.ఆర్ యువసేన నాయకులు అనిల్, గుణాకర్, తాలెల్మ రాము, అఖిల్, సోమశంకర్, మొయిజ్ మరియు
కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు అభిమానులు పాల్గొన్నారు.









