భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో గెలుపొందిన సందర్భంగా సంబరాలు 

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

భారతీయ జనతా పార్టీ పశ్చిమబెంగాల్ పుదుచ్చేరి మరియు అస్సాం రాష్ట్రాల్లో ఘన విజయం సాధించడంతో బిజెపి సదాశివపేట మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి, మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ టీ.ఎం.సి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించి బిజెపి నాయకత్వాన్ని స్వీకరించిందని అలాగే మమతా బెనర్జీ యొక్క అరాచక ప్రభుత్వాన్ని 2/3 మెజారిటీతో ప్రజలు ఓడించారని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా ఉన్నారని ముఖ్యంగా మహిళలు భద్రంగా ఉన్నామన్న భావంతో బిజెపికి ఓటు వేస్తున్నారని భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి విజయం అన్నారు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన ఇండి గ్రూప్ సభ్యులు డిఎంకె, టీఎంసీ మరియు లెఫ్ట్ పార్టీలు ఘోరంగా ఓటమిపాలయ్యాయని రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తామని అన్నారు. తర్వాత మే 10న జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో బహిరంగ సమావేశానికి పోలింగ్ బూత్ వారీగా బయలుదేరి వారి సంఖ్యను స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోవూరు సంగమేశ్వర్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్ రావు, పట్టణ బీజేపీ ఇన్చార్జి కే శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి హోసన్న గారి శ్రీశైలం, కూర్చుని సతీష్,నేనావత్ పురం సింగ్, ఉల్లిగడ్డల నాగన్న, శ్రీకాంత్ రాజ్ ,జి శివలింగం, నవీన్, కుమార్, ధారా రాజేష్, సిహెచ్ శ్రీనివాస్, విక్రం రెడ్డి, ప్రవీణ్,సాంబశివ,గణపురం శేఖర్, శివ,హరికృష్ణ,పవన్ మరియు వరుణ్ తదితరులు పాల్గొన్నారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు