నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పరిధిలోని తెరాడిగూడెం గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన మూడవ వార్షికోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జరిగాయి. గ్రామ పురోహితులు బ్రహ్మశ్రీ కాటపల్లి గిరిధర్ శర్మ, సాయిచక్రధర్ శర్మ మరియు నరసింహమూర్తి శర్మల వేద మంత్రోచ్ఛారణల మధ్య వేడుకలు శాస్త్రోక్తంగా సాగాయి. వార్షికోత్సవ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. స్వామివారికి అభిషేకాలు, అలంకరణలు చేసిన అనంతరం, లోక కల్యాణం కోరుతూ పురోహితుల ఆధ్వర్యంలో ‘శ్రీ సీతారామచంద్రస్వామి హోమం’ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం స్వామివారికి విశేష అర్చనలు, మంగళ హారతులు ఇచ్చారు.ఈ వేడుకను పురస్కరించుకుని గ్రామస్తులందరి సామూహిక సహకారంతో ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామస్తులు స్వచ్ఛందంగా సేవలు అందించారు.ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో స్థానిక సర్పంచ్, జక్కల భాస్కర్, ఉప సర్పంచ్ కన్నెబోయిన కొండయ్య,వార్డు సభ్యులు కన్నెబోయిన శివప్రసాద్, జాల నగేష్, మండల కొండయ్య మరియు గ్రామ ప్రముఖులు కన్నెబోయిన రామారావు యాదవ్, కత్తి గోవర్ధన్ రెడ్డి, గుండ్రెడ్డి చిన్న వెంకటరెడ్డి, కన్నెబోయిన లింగయ్య కన్నెబోయిన లింగయ్య, కత్తి దామోదర్ రెడ్డి భీమన పోయిన సైదులు చివర్ల భాస్కర్ రెడ్డి కసిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఎలుగూరి జోజి రెడ్డి గన్ రెడ్డి పెద్ద వెంకటరెడ్డి జక్కల రాంబాబు కన్యబోయిన శ్రీకాంత్ గ్రామస్తులు అధిక సంఖ్యలో అధికసంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.









