మల్లారెడ్డిగూడెంలో ఆధ్యాత్మిక కోలాహలం: వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం.

సంస్థాన్నారాయణపురంయాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని మల్లారెడ్డిగూడెం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ సీతారా దేవి సమేత మడివాల మాచయ్య స్వామి, గణపతి, శివలింగం, నందీశ్వర, ఈదమ్మ మరియు పోతరాజు విగ్రహాల ప్రతిష్టా మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది.ఉదయం నుండే వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజ,పుణ్యాహవాచనం, విగ్రహాలకు జలాధివాసం, ధాన్యాధివాసం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్ణయించిన శుభ ముహూర్తంలో విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారినిదర్శించుకున్నారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టి కోటి శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం స్థానిక రజక సంఘం ఆధ్వర్యంలో వట్టి కోటి శేఖర్‌ను, సర్పంచ్ ఉప్పల లింగస్వామిని, విజయలక్ష్మిని, మరియు గోలి లింగస్వామిని శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు మరియు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కుల దైవమైన మడివాల మాచయ్య స్వామి విగ్రహ ప్రతిష్టాపన పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు రజక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు