సదశివాపేట మార్కెట్ యార్డ్ ఆవరణలో మేడే వేడుకలు 

TG 5, సంగారెడ్డి ప్రతినిధి ఓకే మీ
స్థానిక పౌరసరఫరాల గోదాంవద్ద ఘనంగా మేడే వేడుకలు దేశ సంపదను సృష్టించేది కార్మికుల రెక్కల కష్టమేనని కార్మికుల త్యాగాలు అమూల్యమైనవని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం 141మేడే సందర్భంగా సదాశివపేటలోని సివిల్ సప్లై గోదాం వద్ద బి ఆర్ టి యుఅనుబంధ సివిల్ సప్లై హమాలి యూనియన్ ఆధ్వర్యంలో మేడే సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ కే బాబు మియా బిఆర్ టియు పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ హమాలీ కార్మికుల కష్టాలు ఎంతో విలువైనయన్నారు. ఉత్పత్తి రంగంలో కార్మికులు భాగం పంచుకొని దేశ సంపదను సృష్టిస్తున్నారన్నారు. మేడే పోరాట స్ఫూర్తితో కార్మికులంతా ఏకం కావాలన్నారు. అనంతరం బి ఆర్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ కే బాబు మియా మాట్లాడుతూ మేడే ఒక మహత్తర పోరాటానికి త్యాగానికి సాధించని పని అంటే గౌరవానికి చిహ్నం అన్నారు. రోజుకు 8 గంటల పని విధానం సాధించుకోవడానికి కార్మికులు 1886 మేలో అమెరికావ్యాప్తంగా వేలాదిమంది కార్మికులు పోరాడి తమ హక్కుల సాధనకై పోరాటంలో ఎంతో మంది కార్మికులు అమరులై హక్కులను,చట్టాలను, సాధించి పెట్టారని దాని ఫలితమే మేడే ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీలమల్లన్న, నాయకులు కొత్త గొల్ల కృష్ణ, చింత సాయి నాథ్, నాగుల విజయ్ కుమార్, సివిల్ సప్లై హమాలి కార్మికులుSK.ఖుర్షిద్ పాషా, M.ప్రభు,యేసురత్నం,MD వాహెద్,SK.పాషా మియా వెంకటేశం, ఔసాద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు