మల్కాజిగిరి కమిషనరేట్‌కు ఇప్పటికే శాంతియుత ప్రాంతంగా మంచి పేరు ఉందని, ఆ పేరును అలాగే నిలబెట్టడం తన ముఖ్య లక్ష్యమని తెలిపారు. మొదటి మహిళా కమిషనర్‌గా నియమితురాలవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.
టెక్నాలజీ సహాయంతో క్వాలిటీ పోలీసింగ్ అందించేందుకు కృషి చేస్తామని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా మల్కాజిగిరి కమిషనరేట్‌లో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ పెద్ద సమస్యగా ఉన్నట్లు గుర్తించామని, దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి నియంత్రణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, సైబర్ నేరాలపై రిపోర్టింగ్ మరియు స్పందనను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
చివరగా, పోలీస్ సిబ్బంది అందరూ ఒక టీంలా కలిసి పనిచేసి మల్కాజిగిరి కమిషనరేట్ ప్రతిష్టను మరింత పెంచాలని కమిషనర్ సుమతి పిలుపునిచ్చారు.









