పేదవారి సొంతింటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం: 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత

  • పేదవారి సొంతింటి కళను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
  • ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన 12 వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

సదాశివపేట పట్టణంలోని ఈశ్వర్ మందిర్ సమీపంలో మంగలి సురేఖ గోపాల్ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ మరియు 12 వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత పేర్కొన్నారు. పట్టణంలోని 12వ వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును పులిమామిడి మమత మరియు సత్యనారాయణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాన్ని అభినందించిన మమత, గృహాన్ని పరిశీలించి అందుబాటులో ఉన్న సదుపాయాలపై ఆరా తీశారు. మన సి.ఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు స్థిర నివాసం కల్పించడం జరుగుతుందని తెలిపారు.
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందేలా కృషి కొనసాగుతుందని, ఇంకా ఎవరైనా ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారు ఇందిరమ్మ ఇల్లు కొరకు దరఖాస్తు పెట్టు కోవలసిందిగా వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పథకం నిరుపేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు మారుతి, తాలెల్మ రాము, బిళ్ళకంటి శ్రీనివాస్, శ్రవణ్, పిల్లోడి చందు, శివ, అఖిల్, సోమ శంకర్, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా కౌన్సిలర్ సేవలను ప్రజలు అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు