సంస్థాన్ నారాయణపురం గ్రామ ఉప సర్పంచ్ పల్లె మల్లారెడ్డి – అరుణ దంపతుల కుమార్తె చందనా రెడ్డి వివాహం, శ్రావణ్ కుమార్ రెడ్డితో వైభవంగా జరిగింది. పెద్ద అంబర్‌పేట్‌లోని తార కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు సంస్థాన్ నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గారు మరియు గ్రామ పాలకవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి గారు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పందుల యాదగిరి గౌడ్, సురపల్లి వెంకటేష్, కట్ల వనజా భాస్కర్ చారి, చింతల శైలజ సత్యనారాయణ ముదిరాజ్, బలుగూరి శివ సాగర్, నీళ్ల అనిత శంకర్ ముదిరాజ్, చిలువేరు శంకర్ రమాదేవి, సింగపంగా ప్రశాంతి రమేష్, పట్నం బాలకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొని నూతన దంపతులకు మంగళాశాసనాలు అందజేశారు. ప్రజాప్రతినిధుల రాకతో వివాహ వేడుకలో సందడి నెలకొంది.









