నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో ప్రముఖ సామాజిక కార్యకర్త, 108 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలుగు సత్యనారాయణ మరియు సంధ్య దంపతుల 18వ వివాహ వార్షికోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. 18 ఏళ్ల అన్యోన్య దాంపత్య ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి.గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన సత్యనారాయణ 108 ఉద్యోగుల జిల్లా అధ్యక్షులుగా ప్రజాసేవలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన వ్యక్తిత్వం, సేవా భావం పట్ల గౌరవంతో పలువురు మండల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, మిత్రులు మరియు శ్రేయోభిలాషులు నేరుగా వారి నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. మరికొందరు ఫోన్ ద్వారా, సోషల్ మీడియా వేదికగా తమ ప్రేమాభిమానాలనుచాటుకున్నారు.సుఖశాంతులతోవర్ధిల్లాలనిసత్యనారాయణ – సంధ్య దంపతులు ఇలాంటి వివాహ వార్షికోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, వారి జీవితాంతం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని గుర్రంపోడు ప్రజలు మనసారా కోరుకున్నారు. అవధులు లేని ప్రేమానురాగాలతో సాగుతున్న వీరి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు కొనసాగాలని,ఆదర్శదంపతులుగా నిలవాలనిపలువురుఆకాంక్షించారు.మిత్రులుమరియుశ్రేయోభిలాషుల శుభాకాంక్షలతో గుర్రంపోడు మండలంలో సందడి వాతావరణం నెలకొంది. తమపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు వెలుగు సత్యనారాయణ – సంధ్య దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు.









