కాంగ్రెస్ పార్టీ కి సేవాదళ్ వెన్నెముక లాంటిది. టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

TG5, సంగారెడ్డి ప్రతినిధి

నాంపల్లి లో జరిగిన కాంగ్రెస్ సేవాదళ్ శిక్షణా శిబిరం లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి పాల్గొన్న నిర్మలా జగ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగమైన సేవాదళ్ ఆధ్వర్యంలో మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో “సమర్థ శిక్షణ శిబిరం” ఘనంగా నిర్వహించారు.పార్టీ క్రమశిక్షణను కాపాడుతూ, ప్రజా సేవే లక్ష్యంగా కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు.

ఈ శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సేవాదళ్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ విధివిధానాలు, క్రమశిక్షణ మరియు సేవా దృక్పథంపై ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం,
రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు పార్టీ సంస్థాగత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ శిక్షణా శిబిరం లో చర్చించడం సంతోషకరం అన్నారు

టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సేవాదళ్ వెన్నెముక వంటిదని, కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లో సేవాదళ్ కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.

క్షేత్రస్థాయిలో నాయకత్వ లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలనే అంశంపై ఈ శిబిరం లో వక్తలు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులతో పాటు, పలువురు సీనియర్ నాయకులు మరియు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వందలాది మంది సేవాదళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు