మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలపై అవగాహన: ఆందోల్ విద్యాసంస్థల్లో ఏహెచ్‌టీయూ (AHTU) సదస్సులు

• ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆందోల్ గ్రామంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, మామిడిపల్లి అగ్రీకల్చర్ కాలేజీ లలో ఎ.హెచ్.టి.యు సంగారెడ్డి బృందం ఆద్వర్యంలో మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మహిళా మరియు బాలల రక్షణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు..

TG 5,సంగారెడ్డి ప్రతినిధి:
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. ఆదేశానుసారం, మంగళవారం రోజున సంగారెడ్డి జిల్లా, ఆందోల్ గ్రామంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, మామిడిపల్లి అగ్రీకల్చర్ కాలేజీ లలో అంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఏహెచ్‌టీయూ ఇన్‌చార్జ్ సీహెచ్ ప్రసాద్ రావు ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా, కార్మికుల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ, ఈవ్ టీజింగ్, అవయవాల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాలలపై లైంగిక దాడులు, సైబర్ స్టాకింగ్, సైబర్ బులీయింగ్, సైబర్ మోసాలు వంటి అంశాలపై వివరించడం జరిగింది. అదేవిధంగా అత్యవసర సేవల కోసం పోలీస్ ఎమర్జెన్సీ నంబర్లు 100, 112, మహిళల హెల్ప్‌లైన్ 1091 / 181 / 1098, చైల్డ్ హెల్ప్‌లైన్, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 వంటి సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కళాశాలల యాజమాన్యం ఏహెచ్‌టీయూ ఎస్ఐ యం.డి లాల్ అహ్మెద్, మాణిక్ రెడ్డి, సిబ్బంది, సుమారు 300 మందిపైగా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు