ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక: సంగారెడ్డిలో మహిళల భద్రత, సైబర్ నేరాలపై షీ టీమ్ అవగాహన సదస్సులు

• ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు..
• రంజోల్ పాలిటెక్నిక్ కాలేజ్, మాచ్నూర్ కేంద్రీయ విద్యాలయ, కాశీపూర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు..

TG5,సంగారెడ్డి ప్రతినిధి:
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ఆదేశానుసారం మంగళవారం రోజున సంగారెడ్డి జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో రంజోల్ పాలిటెక్నిక్ కాలేజ్, మాచ్నూర్ కేంద్రీయ విద్యాలయం, కాశీపూర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాలు అనే అంశాల పై
అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా షీ టీం ఎస్ఐ పూలభాయ్ మాట్లాడుతూ.. జిల్లాలో మహిళల రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, షీ టీమ్ బృందాలు నిరంతరం వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పితృస్వామ్య వ్యవస్థ, లింగ వివక్ష, పని ప్రదేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేదింపులు, సైబర్ నేరాలు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన నంబర్లు 100, 112, 1930, 1098 మరియు సంగారెడ్డి షీ టీమ్ నంబర్ 8712656772 గురించి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఎస్ఐ పూలభాయ్, సిబ్బంది కలిసి మహిళల భద్రత, బాలల రక్షణపై ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు