TG 5, సంగారెడ్డి ప్రతినిధి
• విదేశీయులు తమ దేశాలకు తిరిగి వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.
• ట్రాన్సిట్ హోం అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్
సంగారెడ్డి జిల్లా, జోగిపేట సబ్ జైల్లో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పాస్పోర్ట్ గడువు ముగిసిన వారు, ఇతర కారణాలతో ఇక్కడ ఉంచబడిన విదేశీయులను తమ దేశాలకు తిరిగి పంపించే వరకు ట్రాన్సిట్ హోంలో భద్రతతో ఉంచుతున్నామని తెలిపారు. ప్రస్తుతం 12 మంది విదేశీయులు ట్రాన్సిట్ హోంలో ఉన్నారని, వారి భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
విదేశీయులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించడం జరిగిందని, నిబంధనలకు అనుగుణంగా వారిని చూసుకోవాలని ట్రాన్సిట్ హోం అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జోగిపేట సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పాండు, జైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









