నల్లగొండ: రిపోర్టర్-నవీన్ కుమార్.Ch
నల్లగొండలో విచ్చలవిడిగా కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీ…
ఒకవైపు ప్రొఫెసర్ అయ్యుండి తప్పుడు మెడిసిన్ ఇచ్చిన డాక్టర్.!
నల్లగొండ: ప్రభుత్వ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే వేణు విద్య అనే కార్పొరేట్ హాస్పిటల్ నిర్వహిస్తూ వచ్చిన పేషంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డాక్టర్ విద్యా భార్గవి.
నల్లగొండ పట్టణం వేణు విద్య హాస్పిటల్లో ఆరు నెలల గర్భిణీ చికిత్స కోసం వస్తే డాక్టర్ గర్భ నిరోధక మాత్రలు రాశారు.ఇతర డాక్టర్లకు ఆమె రాసిన ప్రిస్క్రిప్షన్ చూపిస్తే తల్లి బిడ్డ ఇద్దరికీ ప్రాణాంతకం అవుతుందని సూచించినట్టు వెల్లడి.
గమనించిన కుటుంబ సభ్యులు ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి మీ వద్దకు ట్రీట్మెంట్ కోసం ఎన్నో కలలు కంటూ వస్తే ఇటువంటి టాబ్లెట్లు ఎలా రాశారని ప్రశ్నించారు. బై మిస్టేక్‌లో జరిగిపోయింది అయినా ఆ టాబ్లెట్ వేసుకున్న ఏమి కాదు! మనమంతా హ్యూమన్స్ తప్పులు జరగడం సహజం అంటూ… హాస్పిటల్ డాక్టర్స్ హ్యూమన్స్ అంటే తప్పు చేయొచ్చు డాక్టర్లు అయ్యుండి ఇలా చేయడం ఆ కుటుంబ సభ్యులకు కలిచివేసింది. గర్భం దాల్చినప్పటి నుంచి వేణు విద్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న కుటుంబ సభ్యులకు ఎన్నో సందేహాలు ఏర్పడ్డాయి.
తమకు న్యాయం చేయాలని హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో ఈ విధమైన నిర్లక్ష్యం పట్ల హాస్పిటల్ మరియు డాక్టర్లపై నమ్మకం పోయేలా చేస్తున్న హాస్పిటలను ఉన్నతాధికారులు సీజ్ చేసి వేరే వారికి ఎటువంటి అపాయం జరగకుండా చూడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేసుకుంటూనే కార్పొరేట్ హాస్పిటల్ నడుపుతున్న విద్యా భార్గవి విచ్చలవిడిగా ప్రభుత్వ హాస్పిటల్లను నిర్వీర్యం చేస్తూ తమ పొట్ట నింపుకోవడం కోసం ప్రైవేట్ హాస్పిటల్ నిర్వహిస్తూ అందిన కాడికి ప్రజల సొమ్మును దోచుకుంటుంది అంటూ పేషంట్ కుటుంబ సభ్యుల ఆరోపణ.









