TG,5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట మండలం సూరారం గ్రామానికి చెందిన అదీన్ ఫర్జాన్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కృషితో రూ.85 వేల ఎల్ఓసీ మంజూరైంది.
అదేవిధంగా సూరారం గ్రామానికి చెందిన మహమ్మద్ అయాన్ అతీఫ్ కూడా అనారోగ్యంతో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన వైద్య ఖర్చుల కోసం రూ.75 వేల ఎల్ఓసీ మంజూరు చేయించారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్ , మాణిక్ రావు బాధిత కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ చెక్కులను అందజేశారు.
ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పేర్కొన్నారు.
Post Views: 13









