- జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
- సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
TG 5, సంగారెడ్డి ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. నేడు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ పాండు గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ను కోరారు. జిల్లాలో ఈ సంవత్సరం 90వేల ఎకరాలకు పైగా జొన్న పంట సాగు అయిందని అన్నారు. జిల్లా లో గతం కంటే జొన్నల సాగు పెరిగిందని అన్నారు. రైతులు జొన్నల పంట అమ్ముకోవడం కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమం సిపిఎం నాయకులు శ్రీనివాస్,రైతు నాయకులు విఠల్, విష్ణు,రవి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 24









