కోతులారం గ్రామంలో ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని కోతులారం గ్రామంలో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల ఆరోగ్యంపై గ్రామ పంచాయతీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రస్తుతం ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, పని ప్రదేశంలో కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు సర్పంచ్ జాల జంగయ్య యాదవ్ మంగళవారం కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పని సమయంలో నీడన విశ్రాంతి తీసుకుంటూ ద్రవ పదార్థాలు ఎక్కువగా సేవించాలని సూచించారు. గ్రామస్తుల ఆరోగ్యమే లక్ష్యంగా ఇటువంటి చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ ఇందిరమ్మ, వార్డు సభ్యులు కొండూరి నరసింహ, మేటి కనకల లింగస్వామి, పందుల శివ, శంకర వరప్రసాద్, వీరమల్ల లక్ష్మణారి, నల్లవెల్లి సైదులు, కొండూరు వెంకటయ్య, పందుల యాదయ్య, జాజుల వెంకయ్య, పందుల బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు