రాజీవ్ పార్క్ పునరుద్ధరణ పనులు వేగవంతం: మే 10లోపు శంకుస్థాపనకు సిద్ధం చేయాలని జగ్గారెడ్డి ఆదేశం

  • రాజీవ్ పార్క్ పునరుద్దరణ పనులు వేగవంతం చేయండి
  • రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయించిన కదా
  • సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యం లో మే 10 వరకు గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్ లు పూర్తి చేసి శంకుస్థానకు కు సిద్దం చేయండి
  • రాజీవ్ పార్క్ లో పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేసిన జగ్గారెడ్డి

    TG5, సంగారెడ్డి ప్రతినిధి

రూ.3 కోట్లతో వ్యయంతో చేపడుతున్న రాజీవ్ పార్క్ పునరుద్దరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రాజీవ్ పార్క్ లో పర్యటించి పనులను పరిశీలించి మున్సిపల్ అధికారుల కు పలు సూచనలు చేశారు. రాజీవ్ పార్క్ ఎంట్రెన్స్ లోని రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్న చోట ఆకర్షణీయమైన ల్యాండ్ స్కేప్ డిజైన్ ఏర్పాటు చేయాలని, ఇప్పుడున్న బ్లాక్ గ్రానైట్ స్థానం లో వేరే టైల్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. పార్క్ లో ఉన్న మ్యూజిక్ ఫౌంటెన్ పాడైన నేపథ్యం లో కొత్త అధునాతన మ్యూజిక్ ఫౌంటెన్ ఏర్పాటు చేయాలని రోజూ సాయంత్రం వేళలో రెండు పాటల తో ఫౌంటెన్ నడిచే విధంగా ఉండాలని కాంట్రాక్టర్ తో ఫోన్లో మాట్లాడి సూచించారు. ఇప్పుడు మంజూరు అయిన 3 కోట్ల తో కేవలం పునరుద్ధరణ పనులకే సరిపోతాయని అధికారులు జగ్గారెడ్డి కి వివరించారు. మ్యూజిక్ ఫౌంటెన్ ల తో పాటు, 2d,3d లేజర్ ఫౌంటెన్ లు, పార్క్ లో మిగిలిపోయిన అన్ని పనులకు సంబంధించి పూర్తి ప్రతిపాదనలను బుధవారం లో గా సిద్దం చేయాలని అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. పార్క్ లో ప్రత్యేక కృత్రిమ పాండ్ ను నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. పాండ్ లో పెడల్ బోట్లు, సందర్శకులు కూర్చునే విధంగా పాండ్ చుట్టూ బెంచి లు ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి సూచించారు. పార్క్ లో ప్రత్యేకంగా స్కేటింగ్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. సంగారెడ్డి కి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యం లో మే 10 లోగా పార్క్ లో గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, కాంపౌండ్ వాల్ నిర్మాణాలు పూర్తి చేయాలని , పార్క్ ముందు భాగం లో పనులు పూర్తి చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఫౌండేషన్ స్టోన్ వేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారుల కు జగ్గారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ డిఈ, నాయకులు తోపాజి అనంత్ కిషన్, కూన సంతోష్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు