TG5, సంగారెడ్డి ప్రతినిధి
సదాశివపేట, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలను కళాశాల ప్రాంగణంలో వేడుకగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలలో భాగంగా మొదటగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి బంగ్లా భారతి, కళాశాల వార్షిక నివేదికను చదివి వినిపించడం జరిగింది. అలాగే వివిధ కోర్సులలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను అతిథుల చేతులమీదుగా ప్రధానం చేయడం జరిగింది. కళాశాల పూర్వ విద్యార్థులచే నూతనంగా నిర్మించిన వేదికను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సదాశివపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ శ్రీమతి అంజమ్మ సత్యనారాయణ గారు మాట్లాడుతూ కళాశాలకు వసతుల కల్పనకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. కళాశాల విద్యార్థులకు స్కాలర్షిప్ లను మంజూరు చేసిన మలబార్ గోల్డ్ సంస్థ ప్రతినిధులను సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం వైస్ చైర్ పర్సన్ శ్రీమతి రేణుకా చిరంజీవి, శ్రీ జి. రామి రెడ్డి సి డి సి చైర్మన్, 7 వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి అనిత విష్ణువర్ధన్ రెడ్డి గారు , కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ పతంజలి, అలుమ్ని కన్వీనర్ మహేష్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. యన్ . సిద్దులు , శకుంతల, సరవయ్య , సావిద్య , మంజుల , రాజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









