TG 5, సంగారెడ్డి ప్రతిని ధి
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలో వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీ చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
అనంతరం పట్టణ కార్యదర్శి నర్సింలు పార్టీ జెండాను ఎగురవేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు …
తదుపరి కంది లోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ.. జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చింత సాయినాథ్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, మాజీ సీడీసీ చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, డా. శ్రీహరి, వేణుగోపాల స్వామి, మల్ల గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు, చక్రపాణి, విఠల్, గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు పొన్న రాజేందర్ రెడ్డి, దశరథ్ రెడ్డి, మైనార్టీ టౌన్ అధ్యక్షులు అంజద్, అజీమ్, మాజీ కౌన్సిలర్లు విఠల్ రెడ్డి, విష్ణువర్ధన్, నర్సింలు, బత్తుల శ్రీనివాస్, లాడే బాలు, యువ నాయకులు శ్రవణ్ రెడ్డి, వజిత్, చింటూ, అఖిల్,మాజీ సర్పంచ్లు మాణిక్ ప్రభు, రుక్మొదిన్, శంకర్ గౌడ్, నరసింహ గౌడ్, వెంకటేష్ గౌడ్, గౌతం, దిలీప్, నరసింహ రాజు, అనిల్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









