చీకటిమామిడి గ్రామానికి చెందిన అనంత అండలు – వెంకటయ్య గౌడ్ దంపతుల కుమారుడు రాఘవేంద్ర గౌడ్, మేఘనల వివాహ వేడుక చౌటుప్పల్ పట్టణంలోని వివిఆర్ ఫంక్షన్ హాల్లో అత్యంత వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, రాజకీయ ప్రముఖుల మధ్య వేద మంత్రోచ్ఛారణలతో ఈ వేడుక కన్నులపండువగానిర్వహించబడిందిఈ వివాహ వేడుకకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టికోటి శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన వధూవరులను పూలమాలలతో సత్కరించి, అక్షింతలు వేసి నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు.ఈ శుభకార్యంలో జక్కల మల్లేష్ యాదవ్, అనంత నరేష్ గౌడ్, చిట్ల విగ్నేష్ గౌడ్, ఇమ్రాన్, చిన్నగోని సైదులు, తొండ మహేష్, సిద్దు, శనిగల సైదులు, మహేష్, అర్జున్ తదితర నాయకులు, గ్రామ ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 40









