వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ..

TG 5, సంగారెడ్డి ప్రతిని ధి

 

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆందోల్ నియోజకవర్గం – మునిపల్లి మండలంలో బుదేరా లో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ వార్షికోత్సవం లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎస్సీ ఎస్టీలను ప్రవేశపెట్టామన్నారు అందులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభించామన్నారు. తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ ఆందోల్ నియోజకవర్గంలోని బుదేరాలో ప్రారంభించడం జరిగిందన్నారు. బుదేరా రెసిడెన్షియల్ స్కూల్ లో డిజిటల్ విద్యను అందిస్తున్నామన్నారు విద్యార్థుల కోసం ఆధునిక బెడ్స్ కిచెన్ వేర్స్ అందించమన్నారు విద్యార్థినులకు అవసరాల కోసం ఉజ్వల భవిష్యత్తు ,బలమైన పునాది కోసం మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రెసిడెన్షియల్ స్కూల్లో క్రీడా సదుపాయాలు కల్పనకు, డిజిటల్ లైబ్రరీ, పుస్తకాలను సమకూర్చామని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. బుదేరా రెసిడెన్షియల్ స్కూల్ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ రెసిడెన్షియల్ స్కూల్ గా అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆకాంక్షించారు..

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో విద్యా , వైద్య రంగాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఆందోల్ నియోజకవర్గం విద్య, వైద్య రంగాల హబ్ గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు.

 

అనంతరం రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినిలతో ముఖాముఖిగా మాట్లాడారు. విద్యార్థినిలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు మెడల్స్, ప్రశంస పత్రాలను అందజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు