ఎన్టీఆర్ నగర్‌లో మిర్చి తొడిమెలు కాల్చివేత – ప్రజల ఆరోగ్యానికి ముప్పు…

14 వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు

మాజీ డివిజన్ యూత్ అధ్యక్షుడు

శ్రీ కుంభం శివపటేల్

 

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14 వ డివిజన్ పరిధి లోని ఎన్టీఆర్ నగర్ మరియు పరిసర ప్రాంతాలలో గత కొంతకాలంగా సాయంత్రం వేళల్లో కొన్ని గోదాముల వద్ద మిర్చి తొడిమెలను పెద్ద ఎత్తున కాల్చివేస్తున్నారు. ఈ చర్యల వల్ల తీవ్ర స్థాయిలో పొగ, దుర్వాసన వ్యాపించి స్థానిక నివాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

ఈ పొగ కారణంగా ప్రజలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు, కళ్ల మంటలు, అలర్జీలు మరియు ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్థమా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.

 

ఇలాంటి తొడిమెలు కాల్చడం పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు విరుద్ధమైన చర్య. అయినప్పటికీ సంబంధిత వ్యక్తులు నిర్లక్ష్యంగా ఈ పనిని కొనసాగిస్తున్నారు.

 

కాబట్టి, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ నగర్ నివాసులు కోరుతున్నారు. అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నాము..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు