సంగారెడ్డి ప్రజలకు రోజూ 2 గంటల మంచినీరు: రూ. 200 కోట్లతో మంజీరా వాటర్ స్కీమ్ అదనపు ప్రతిపాదనలు

  • సంగారెడ్డి పట్టణ ప్రజలకు ప్రతిరోజూ 2 గంటలపాటు స్వచ్ఛమైన మంచినీళ్లు అందించడానికి రూ. 200 కోట్లతో మంజీరా వాటర్ స్కీమ్ అదనపు పనులకు ప్రతిపాదనలు
  • సంగారెడ్డి పట్టణానికి మంజీరా నీటి సరఫరా పై మున్సిపల్, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ అధికారులతో జగ్గారెడ్డి, నిర్మల రివ్యూ సమావేశం

TG 5, సంగారెడ్డి ప్రతినిధి

 

– నేను ఎమ్మెల్యే కాకముందు సంగారెడ్డిలో ఆరు ఫీట్ల లోతులో గుంతల్లో దిగి నీళ్లు పట్టుకునేవారు

 

– మాకు గుంతలు లేకుండా , గ్రౌండ్ పై మంజీరా నీళ్ళు రావాలని ఎన్నికల సమయం లో నన్ను కోరారు

 

– ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సంగారెడ్డిలో రూ. 230 కోట్లతో మంజీరా వాటర్ స్కీమ్ ఏర్పాటు చేయించా..

 

– నాలుగు దిక్కులా పైపులైన్లు, ట్యాంకులు, నల్లాల కనేక్షన్లు నిర్మించడానికి నాలుగేళ్ల సమయం పట్టింది

 

– ఆనాడు నల్లా కనెక్షన్ల కోసం 2 వేల నుండి 3 వేల రూపాయలు ఖర్చు అయ్యేది..

 

– మున్సిపల్ లో ఒక రిజల్యూషన్ పెట్టీ ఉచితంగా 18 వేల మంది కి మంజీరా నీళ్ళ కనెక్షన్ ఇచ్చి ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చూశాం

 

– 2014 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి మిషన్ భగీరథ తెచ్చింది.

 

– కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే గా లేకున్నా గత సంవత్సరం నుండి మళ్లీ దీనిపై రివ్యూ చేస్తున్న

 

– మంజీరా లో ఇప్పుడున్న ఇంటేక్ వెల్ స్థానంలో మరింత లోపలికి ఇంటెక్ వెల్ ఏర్పాటు చేయాలి.. అదనంగా టాంక్ ల నిర్మాణం చేయాలి

 

– రోజూ రెండు గంటల పాటు మంజీరా నీరు రావాలి

 

– మరో యాభై ఏళ్ల కు సరిపడా నీటి సరఫరా కు ఇబ్బంది రావద్దని డిజైన్ చేస్తున్న..

 

– ఓట్లకు, మంజీరా నీటికి సంబంధం లేదు. నేను ఊరొన్ని కాబట్టి చేస్తున్న

 

– ప్రస్తుత ప్రాజెక్ట్ వ్యయం రూ. 175 కోట్లతో కొత్తగా ప్రతిపాదన, మంజీరా డ్యాం వద్ద అదనంగా రూ. 25 కోట్లతో మరొక ఇంటెక్ వెల్ కలిపి మొత్తం రూ. 200 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు

 

– ఇప్పుడున్న 12 ట్యాంక్ లకు అదనంగా 8 ట్యాంకులు ఏర్పాటు

 

– రూ. 10 కోట్లతో కొత్త ఫిల్టర్ బెడ్ నిర్మాణం

 

– ఇంటెక్ వెల్ కు అదనంగా రూ. 5 కోట్లు

 

– రూ. 3.5 కోట్ల తో 1800 కిలో లీటర్ల కెపాసిటీ తో సంపు నిర్మాణం

 

– కొత్తగా. 50 కిలో మీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ పైపు లైన్ ఏర్పాటు

 

– ఆదర్శ్ నగర్, మాస్టర్ మైండ్స్, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ పార్క్ లో రెండు , రెవెన్యూ కాలనీ, సాయి నగర్, చింతపల్లి లో ట్యాంక్ ల నిర్మాణం

 

– వచ్చే సోమవారం అత్యవసర కౌన్సిల్ సమావేశం లో పార్టీలకతీతంగా 38 మంది కౌన్సిలర్ ల అభిప్రాయం తీసుకోండి

 

– కాలనీ ల్లో తిరగండి, ప్రజల ను అడగండి, ఇంకేమైనా మిగిలిపోయాయా? తెలుసుకుని.. 5 వ తేదీ వరకు అదనంగా పైప్ లైన్ లు కావాలో వివరాలు సేకరించండి

 

– స్థానిక ఎమ్మెల్యే, ఎంపి అభిప్రాయం కూడా తీసుకోండి

 

– ఎక్కడెక్కడ పైప్ లైన్ కావాలో మున్సిపల్ లో దరఖాస్తు చేసుకోవాలని మూడు రోజుల పాటు ఆటోలో తిరిగి చాటింపు వేయండి ..

 

– సంగారెడ్డి టౌన్ లో ఎక్కడ కూడా నల్లా నీటి గుంతలు ఉండకూడదు అని అధికారులకు సూచన

 

– ఈ పదేళ్ల లో జరిగిన నష్టాన్ని పూర్తి చేయాలని సంగారెడ్డి ప్రజల కోసం రూ. 200 కోట్లతో డిజైన్ చేస్తున్న

 

– మంజూరు, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని, 2027 లో పనులు ప్రారంభించి 2028 వరకు పనులు పూర్తయితే తిరిగి సీఎం రేవంత్ రెడ్డి తో ప్రారంభించు కోవాలి అనేది నా ప్రణాళిక

 

– ఎక్కడైతే సంగారెడ్డి టౌన్ లో మిషన్ భగీరథ పైప్ లైన్ కలిపారో అది కట్ చేసి కొత్తగా నిర్మించే మంజీరా వాటర్ పైప్ లైన్ కు కలపాలి

 

… ఉమ్మడి రాష్ట్రం లో రెండు గంటల పాటు పుష్కలంగా మంజీరా నీరు వచ్చేది

 

..పదేళ్ల క్రితం ఫస్ట్ ఫ్లోర్ కు సైతం మంజీరా నీళ్ళు వచ్చేవి

 

… ఈ పదేళ్ల లో మొత్తం మంజీరా వాటర్ స్కీమ్ ను నాశనం చేశారు

 

… మిషన్ భగీరథ తీసుకువచ్చి సంగారెడ్డి మంజీరా వాటర్ స్కీమ్ ను పూర్తిగా బ్రష్టు పట్టించారు

 

సీఎం సంగారెడ్డి కి త్వరలో వస్తున్న నేపథ్యం lo వచ్చే నెల 5 వ తేదీ వరకు పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు జగ్గారెడ్డి సూచన

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు