రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకటరాములు అంత్యక్రియల్లో పాల్గొని, కుటుంబానికి భరోసానిచ్చిన ఎస్పీ పరితోష్ పంకజ్.

• ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ మాసాని వెంకటరాములు అంత్యక్రియల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ.
• వెంకటరాములు కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి జిల్లా పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్.

TG 5,సంగారెడ్డి ప్రతినిధి:

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ మాసాని వెంకటరాములు అంత్యక్రియలకు నారాయణఖేడ్ పట్టణంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హాజరై, వెంకటరాములు మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వెంకటరాములకు రావలసిన అన్ని రకాల ప్రయోజనాలు (బెనిఫిట్స్) సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జహీరాబాద్ రూరల్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మాసాని వెంకటరాములు తేది 23.04.2026న నారాయణఖేడ్ నుండి జహీరాబాద్ రూరల్ పోలీసు స్టేషన్‌కు బైక్‌పై వెళ్తుండగా, ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో న్యాల్కల్ మండలం, చాల్కి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం కొండాపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట జహీరాబాద్ డిఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ శివలింగం, జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశీనాథ్, నారాయణఖేడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు